Abn logo
Jan 20 2021 @ 22:43PM

బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి

జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌

ములుగు, జనవరి 20: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను మట్టి కరిపించాలని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ములుగులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందని స్పష్టం చేశారు. ఆయన గెలుపు కోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఎన్నికల కమిటీలు క్షేత్ర స్థాయిలో విశేషంగా పనిచేయాలని అన్నారు. బీజేపీ గెలుపు భ్రమ మాత్రమేనని, కాంగ్రెస్‌ తన ఉనికి కోసం పాకులాడుతోందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌ను ప్రజలు కూడా విస్మరించారని, మాటలతో కోటలు కడుతున్న బీజేపీ నాయకుల పాత్ర ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే ఉంటుందని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, కూరెళ్ల రామాచారి, మురహరి భిక్షపతి, గడదాసు సునీల్‌కుమార్‌, కుడుముల లక్ష్మీనారాయణ, బండారి చంద్రయ్య, సుబ్బుల సమ్మయ్య, వేణు, ఆత్మ ఏటూరునాగారం డివిజన్‌ చైర్మన్‌ దుర్గం రమణయ్య, జడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, పీఏసీఎస్‌ చైర్మన్లు రమేష్‌, రాములు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement