Abn logo
Sep 6 2020 @ 03:46AM

నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలి

Kaakateeya
 


జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి 


ఆమనగల్లు /కడ్తాల్‌యాచారం:గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధి లోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, హరతహారం పనులను ఆయన పరిశీలించారు. కడ్తాల, మంగళపల్లిలో రైతువేదిక, వైకుంఠథామం నిర్మాణ పనులను పరిశీలించారు. హరితహారంలో నాటిన చెట్లు ఎండకుండా నీరందించాలని సర్పంచ్‌, అధికారులకు సూచించారు.


కడ్తాల మండలం గొర్లకుంట చెరువు కట్ట ఎత్తు, వెడల్పు పెంచి కట్టపై బీటీరోడ్డు ఏర్పాటు చేయాలని, ఉప్పరాశి చెరువుకు అన్మాస్‌ పల్లి చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుడి వరకు రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి సీఈవోను అభ్యర్థించారు. స్పందించిన ఆయన పనులపై నివేదిక పంపాల న్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు వెంకట్రాములు, అను రాధ, ఎంపీవోలు ఉమారాణి, తేజ్‌ సింగ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


హరితహారం, ప్రకృతివనాలపై దృష్టి సారించాలి

హరితహారం కింద నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించేందుకు కార్యదర్శులు, యువత చొరవ తీసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జానకీరెడ్డి, యాచారం ఎంపీపీ సుకన్యబాషా అన్నారు. శనివారం ఆయన గున్‌గల్‌, గడ్డమల్లాయాగూడ పంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతంరం మండల పరిషత్‌ కార్యాల యంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 


రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు నాటుతున్నామని, వాటిన పరి రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పల్లెప్రకృతి వనాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్‌కుమార్‌, ఈవోఆర్డీ వినోద్‌కుమార్‌, ఉపాధిహామి ఇంచార్జ్‌ ఏపీవో శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement