కవ్వాల్ అటవీ ప్రాంతంలో చైర్పర్సన్ విజయలక్ష్మీ
కడెం, జనవరి 19 : జడ్పీ చైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కడెం అడవుల్లో పర్యటించారు. కడెం ప్రాజెక్టు బోటులో షికారు చేసి, ఐలవ్ కవ్వాల్ టైగర్ రిజర్వు లోగో వద్ద కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి కల్పకుంట అటవీ ప్రాంతాన్ని సందర్శించి అటవీ అందాలను తిలకించారు. వారి వెంట ఎంపీడీవో వెంక టేశ్వర్లు, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ రఫీక్, ఎఫ్ఆర్వోలు అనిత, నాయకులు దినకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.