Abn logo
Jul 10 2020 @ 18:58PM

రాత్రికి రాత్రే స్థలం ఆక్రమించి అమ్మకాలు సాగించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు

నెల్లూరు : అధికారంలో ఉన్నాం కదా అని కొందరు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు ఇష్టానుసారం ప్రవరిస్తున్నారు. తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పలువురి ఎమ్మెల్యేల అనుచరుల వ్యవహారాలు మీడియా, సోషల్ మీడియా వేదికగా వెలుగు చూసిన విషయం విదితమే. అయితే.. తాజాగా నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల ఆగడాలు వెలుగు చూశాయి. పూర్తి వివరాల్లోకెళితే.. కావలి విశ్వోదయ విద్యా సంస్థల ఎదురుగా రూ.కోటి విలువ చేసే స్థలాన్ని రాత్రికిరాత్రే ఆక్రమించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు అమ్మకాలు సాగించిన ప్రారంభించారు. అయితే ఇదేంటి..? అని పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించగా వారిపై అక్రమంగా వారిపై పోలీసు కేసులు, తీవ్రస్థాయిలో అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో రాజకీయపార్టీల నేతలు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.


ఆదిలక్ష్మి పాహిమాం..!

కాగా.. ఇదే విశ్వోదయ విద్యాసంస్థల్లోనే ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి చదువుకున్నారు. ఈ అక్రమాలను ఆమే ఆపాలని ‘ఆదిలక్ష్మి పాహిమాం.. రక్షమాం...’ అంటూ విశ్వోదయ ఉద్యోగినిలు, ఉపాధ్యాయిలు, ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కానీ.. ఆయన సతీమణి గానీ రియాక్ట్ అవ్వకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement