Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 11 2021 @ 14:44PM

షర్మిల 72 గంటల దీక్షకు అనుమతి నిరాకరణ..

హైదరాబాద్: వైఎస్ షర్మిల 72 గంటల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేయాలని షర్మల నిర్ణయించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటలపాటు దీక్ష చేయడానికి నిర్ణయించారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు దీక్ష చేయాలనుకున్నారు. ఇందిరాపార్క్ వేదికగా తలపెట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాగా కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొంటున్నారు. దీనికి అనుమతి ఇవ్వడంతో షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేసేందుకు షర్మిల నిర్ణయించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement