Abn logo
Jan 17 2021 @ 23:44PM

యువకుడు దారుణ హత్య

 పెద్ద దోర్నాల, జనవరి 17: యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున మండలంలోని తిమ్మాపురంలో చో టుచేసుకొంది. ఉదయం గ్రామం నడిబొడ్డున పీర్లచా విడి పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంకు వద్ద నీళ్లు పట్టుకొనేం దుకు వెళ్లగా మండ్ల శ్రీను(20) మృతి చెంది ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. స్థానిక పోలీసులకు సమా చారం అందజేయగా, ఉన్నతాధికారులు సంఘటనా స్థ లాన్ని పరిశీలించారు. మృతుని తల్లిదండ్రులు మండ్ల రంగయ్య, వెంకట లక్ష్మమ్మలను విచారించారు. శనివారం సాయంత్రం వరకు మిరపకాయల కోతల పనుల్లో ఉండి రాత్రి వచ్చాడని చెప్పారు. మద్యం తీసుకునే అలవాటు ఉండటంతో తాగి పీర్లచావిడి వద్ద పడుకుని ఉన్నాడని తెలిపారు. మ త్తు వదిలి ఇంటికి వస్తాడనుకున్నామని, తెల్లారికల్లా ఇలా చూడాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో తెలి యదని తల్లిదండ్రులు పేర్కొన్నారు.  డాగ్‌, స్పెషల్‌ స్క్వాడ్‌ బృందంతో పోలీసులు ప్రత్యేక తనీఖీలు నిర్వహించారు. అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement