Abn logo
Jul 12 2020 @ 08:30AM

విశాఖలో యువకుడు అనుమానాస్పద మృతి

విశాఖపట్నం : నగరంలోని విశాలాక్షి నగర్‌లో విజయ్ కుమార్ (26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడంతస్తుల పై నుంచి పడి చనిపోవడంతో పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆ యువకుడ్ని తోసేశారా..? లేకుంటే ఆత్మహత్య చేసుకున్నాడా..? అసలేం జరిగింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. మృతుడు విజయ్ కుమార్ స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆరిలోవ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement