Abn logo
Sep 19 2020 @ 00:07AM

మత్తు వదలరా..మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత

Kaakateeya

పట్టణాలు, పల్లెలకు పాకుతున్న హుక్కా

గుట్టుగా సాగుతున్న గంజాయి సరఫరా

ఫిర్యాదులు చేస్తునే స్పందిస్తున్న పోలీస్‌ శాఖ


మహబూబ్‌నగర్‌/జడ్చర్ల, సెప్టెంబరు 18 : మత్తుకు యువత బానిసవుతోంది. మద్యం, సిగరెట్‌ మత్తుకన్నా, మరింత కిక్‌ ఇచ్చే మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులవుతోంది. వాటికి బానిసై ఆరోగ్యంతో పాటు బంగారు భవితను నాశనం చేసుకుంటోంది. నరగాలకే పరిమితమైన ఇలాంటి విష సంస్కృతి ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపిస్తోంది. మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జడ్చర్ల పట్టణంలో ఈ సంస్కృతి పెరిగిపోతుంది. జడ్చర్ల పరిసరాలలో పరిశ్రమలు, సెజ్‌, కళాశాలలు వెలవడం వల్ల, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో నివాసముంటుండటంతో అడ్వాన్స్‌ కల్చర్‌ పెరిగిపోతోంది.


ఈ క్రమంలో హుక్కాను విద్యార్థులు, యువకులు ఎక్కువగా తీసుకుంటున్నారు. జడ్చర్లతోపాటు పాలమూరు, వనపర్తి, నారాయణపేట పట్టణాలకు ఈ కల్చర్ల పాకుతోంది.  ఒక సిగరెట్‌ ఒకరే తాగే అవకాశం ఉండటంతో, ఇద్దురు నుంచి నలుగురు ఒకేసారి షేర్‌ చేసుకునేందుకు హుక్కాను వాడుతున్నారు. సిగరెట్‌, గంజాయి తరహాలో హుక్కా పీల్చితే వాసన రాదు. పక్కగదికి కూడా వాసన వచ్చే అవకాశం ఉండదు. దీంతో ఎక్కువ మంది హుక్కాను అలవాటు చేసుకొని, తమ ఆరోగ్యాన్ని చేజేతులానాశనం చేసుకుంటున్నారు.


హుక్కాతో పాటు గంజాయి మత్తుకు కూడా బానిసవుతోంది. మహబూబ్‌నగర్‌లోని కొత్తగంజి, రైల్వేస్టేషన్‌, కొత్త చెరువురోడ్‌, న్యూటౌన్‌, షాషాబ్‌గుట్ట, శ్రీనివాసకాలనీతోపాటు శివారు ప్రాంతాలలో యువత గంజాయిని తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో నిర్వహించిన పోలీసు ప్రజాదర్బార్‌లోనూ పలువురు గంజాయి గురించి ఫిర్యాదులు చేశారు. పలుచోట్ల గంజాయిని కూడా పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఫోన్‌ల ద్వారానే కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాలలో అడ్డాలు కూడా ఉన్నాయి. జడ్చర్లలోనూ గంజాయి బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఫిర్యాదులు వచ్చినపుడు పోలీసులు స్పందిస్తున్నా, ఆ తరువాత వాటి జోలికి వెళ్లకపోవడంతో యువత పెడదోవ పడుతోంది. 

Advertisement
Advertisement
Advertisement