Abn logo
Sep 24 2020 @ 01:49AM

మోజు తీర్చుకొని..వదిలేశాడు

17 ఏళ్ల బాలికపై యువకుడి ఆత్యాచారం

రెండు సార్లు ఆర్‌ఎంపీతో గర్భం తీయించిన వైనం

 పెళ్లి చేసుకోమని బాలిక కోరడంతో ఆత్మహత్యాయత్నం


నారాయణపేట క్రైం, సెప్టెంబరు 23 : ప్రేమిస్తున్నానని ఆ బాలికను నమ్మించి, గర్భవతిని చేశాడు. తీరా తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో, నిరాకరించాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 


మండలంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించాడు. బాలికను శారీరకంగా లొంగదీసుకొని పలుసార్లు గర్భవతిని చేశాడు. గతంలో బాలికకు గ్రామంలో ఉన్న ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌తో బలవంతంగా మాత్రలు ఇప్పించి రెండు సార్లు గర్భం తీయించాడు. ప్రస్తుతం ఆ బాలిక మళ్లీ గర్భం దాల్చడంతో, తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది.


దీంతో అతను ఒంటిపై డీజిల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన్నట్లు తెలిసింది. కాగా, బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ఇటీవల దామరగిద్ద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సంఘటనపై ఇరువర్గాల కుటుంబ సభ్యులు రాజీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌ఐ రాంబాబును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఏఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని సంప్రదించగా తనకు ఏమి తెలియదని సమాధనం ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement