Abn logo
Jul 11 2021 @ 10:57AM

పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ : నగరంలోని అంబర్‌పేట వివాహం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట డివిజన్‌ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న చెన్నకృష్ణయ్య కుమార్తె ఆదిలక్ష్మి(22) టైలర్‌.  వివాహం కావ డం లేదని మనస్తాపానికి గురైంది. శనివారం ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. ఆదిలక్ష్మి తండ్రి చెన్నకృష్ణయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బీ కేర్ఫుల్మరిన్ని...