Abn logo

పెరుగు కబాబ్‌

కావలసినవి: పెరుగు - 400గ్రాములు, పనీర్‌ - 100గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - ఒక కట్ట, బాదం పలుకులు - పది, ఎండుద్రాక్ష - ఐదారు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, మొక్కజొన్న పిండి - కొద్దిగా, ఓట్స్‌ - ఒక కప్పు.


తయారీ: పెరుగును సన్నటి గుడ్డలో వేసి నీళ్లు వార్చాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని, పనీర్‌ ముక్కలు వేయాలి. ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, వేగించిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు వేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుని వత్తుకుంటూ మొక్కజొన్న పిండి అద్దుకోవాలి. తరువాత ఓట్స్‌ను అద్దాలి. పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక కబాబ్‌లను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. చట్నీతో సర్వ్‌ చేసుకుంటే కబాబ్‌లు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.


ఖర్చు తక్కువ.. రుచి ఎక్కువ..

వీటిలో వైరస్‌తో పోరాడే శక్తి.. మీరూ ట్రై చేయండి..

బంగాళదుంప యోగర్ట్‌

కాకరకాయ పెరుగు కర్రీ

దహీ తడ్కా

మిల్లెట్‌ దోశ

ఓట్స్‌ చాట్‌

హోలీ కాంజీ!

పనసకాయ బిర్యాని

పనస గింజల వడలు