ముంబై (మహారాష్ట్ర): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల జారీ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించారు.ఉత్తరప్రదేశ్ చరిత్రలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల జారీతో అభివృద్ధికి బాటలు పడ్డాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ల లక్నో మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల జారీ ఏర్పాట్లను యూపీ రాష్ట్ర మంత్రి సిద్దార్థనాథ్ సింగ్, అశుతోష్ టాండన్, అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పర్యవేక్షించారు.
అంతకు ముందు మంగళవారం రాత్రి ముంబైలోని ఒబెరాయ్ హోటల్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రముఖ సినీనటుడు అక్షయ్ కుమార్ విందు సమావేశంలో భేటీ అయ్యారు. యూపీలో ఫిలింసిటీ నిర్మాణం, ఉత్తరాదిలో సినిమా షూటింగులపై సీఎం యోగి అక్షయ్ కుమార్ తో చర్చించారు.సీఎం యోగి ముంబై బాలీవుడ్ తారలతో సమావేశమైన అనంతరం బుధవారం సాయంత్రం తిరిగి లక్నోకు రానున్నారు.