Abn logo
May 28 2020 @ 11:32AM

చై-సామ్ మరోసారి మాయ చేయనున్నారా?

పదేళ్ల కిందట `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ సినిమా తెలుగులో సమంతకు తొలి చిత్రం కాగా, నాగచైతన్యకు రెండోది. ఈ సినిమా సమయంలోనే స్నేహితులుగా మారిన చైతన్య, సమంత ఆ తర్వాత ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నారు. 


ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ తెరకెక్కనుందని గౌతమ్ ఇటీవల ప్రకటించారు. తమిళంలో తొలి భాగంలో నటించిన శింబు, త్రిష ఈ సీక్వెల్‌లో కూడా సందడి చేయనున్నారు. అయితే తెలుగు గురించి ఇంకా క్లారిటీ రాలేదు. 2010లో తమిళంలో శింబు, త్రిషతో, తెలుగులో చైతన్య, సమంతతో ఒకేసారి రెండో భాషల్లోనూ ఈ సినిమాను గౌతమ్ రూపొందించారు. మరి, ఈ సీక్వెల్‌ను కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.  


Advertisement
Advertisement
Advertisement