Abn logo
Oct 22 2021 @ 00:01AM

వైసీపీ జనాగ్రహ దీక్ష

దీక్షలో పాల్గొన్న షమీంఅస్లాం, మనూజ, తదితరులు


మదనపల్లె, అక్టోబరు 21: పార్టీ కార్యాలయం వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధి నేత చంద్రబాబు చేస్తున్న 36 గంటల నిరసన దీక్షకు వ్యతిరేకంగా  వైసీపీ నేతలు జనా గ్రహం పేరుతో దీక్ష చేపట్టారు.  బెంగళూరు బస్టాండులో ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ జి.షమీం అస్లాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టా రు. సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్య లను ప్రశ్నించడం తప్పా అని మండిపడ్డారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వి.మనూజ, వైస్‌చైర్మన్లు వెంకటా చలపతి, నూర్‌ఆజం తదితరులు పాల్గొన్నారు. సీఎంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  వైసీపీ నాయకులు బి.కొత్తకోట జ్యోతి బస్టాండులో జనా గ్రహ దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీపీ ఖలీల్‌, ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, సింగిల్‌ విండో అధ్యక్షుడు తిరుమల అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.  సీఎం జగన్‌పై టీడీపీ నాయ కుల అనుచిత వ్యాఖ్యలపై  పెద్దమండ్యం మాజీ ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.  విజయభాస్కర్‌,  ఖాదర్‌బేగ్‌ పాల్గొన్నారు.