Abn logo
Jul 15 2020 @ 03:40AM

వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ఉద్యమిస్తాం

 టీడీపీ అధినేత చంద్రబాబుతో జిల్లా నేతలు


 గుంటూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నానాటికీ పెరుగుతున్న అవినీతిపె ఉద్య మిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయు లు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా మంగళవారం పార్టీ అధినే త చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడు తూ గుంటూరు నగరంతో పాటు, అడవి తక్కెళ్లపాడు వద్ద ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద కట్టిన ఇళ్ల ను క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా రైతులు వద్ద కొనుగోలు చేసిన పసుపు, జొన్న, మొక్క జొన్న పంటల తాలూకు సొమ్మును ఇంతవరకు చెల్లించలేదన్నారు. వీటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొ చ్చేందుకు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. మాజీమంత్రి ఆనందబాబు మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములు కొ నుగోళ్లులో భారీ అవినీతి జరిగిందని అన్నారు. వైసీపీ నాయకులే కారుచౌకగా భూములు కొనుగోలు చేసి నాలుగైదు రెట్ల అధికధరకు ప్రభుత్వానికి కట్టబెట్టారని తెలిపారు. అమరావతి మండలం ముత్తాయపాలెంలో బ్యాంకుకి తాకట్టు పెట్టిన భూమిని ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వానికి అమ్మారని.. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారులు, వైసీపీ నేతల భాగస్వామ్యం కూడా ఉందని తెలిపారు. మాజీమంత్రి ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, వేధింపుల గురించి వివ రించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నేతలు మన్నవ సుబ్బారావు, ఎం.ధారు నాయక్‌, లాల్‌వజీర్‌  పాల్గొన్నారు. 


జీవీకి జన్మదిన శుభాకాంక్షలు 

 పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయనకు అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పశ్చియ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నేతలు కనపర్తి శ్రీనివాసరావు, కసు కుర్తి హనుమంతరావు, పాకాలపాటి శ్రీకాంత్‌, పిల్లి మానిక్యరావు, ఎల్లావు అశోక్‌, పోపూరి నరేంద్ర, షేక్‌ హస్మా తదితరులు కేక్‌ కట్‌చేసి జీవీ ఆంజనేయులుకు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement