Abn logo
Oct 22 2021 @ 20:06PM

సంతలో జనాగ్రహ దీక్ష

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలోని సంత మైదానంలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జనాగ్రహ దీక్ష నిర్వహించారు. దీంతో తాము ఉపాధి కోల్పోయామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత నిర్వహిస్తారు. ఉద్దానం నుంచి చిరువ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడతారు. కాగా, వైసీపీ నేతలు మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో జనాగ్రహ దీక్ష శిబిరాన్ని సంతలో  ఏర్పాటు చేయడంతో వ్యాపారులు అయోమయం చెందారు. ఫుట్‌పాత్‌పైనే వస్తువులను విక్రయించారు.  

ఇవి కూడా చదవండిImage Caption