Abn logo
Jul 12 2020 @ 08:32AM

రూ.200 ఇచ్చినా మంచి భోజనం పెట్టరా?: వైసీపీ ఎంపీ

కాంట్రాక్టర్లపై ఎంపీ భరత్‌ ఆగ్రహం


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సెంటర్లలో బాధితులకు సరైన భోజనం అందకపోవడం పట్ల రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఒక బాధితుడికి టిఫిన్‌, భోజనం, స్నాక్స్‌, డిన్నర్‌ అందించడానికి రూ.200 ఇస్తున్నప్పటికీ, నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడంలేదని కాంట్రాక్టర్లను నిలదీశారు. లోపాలను సరిచేసుకోని పక్షంలో కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేయిస్తానని హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement