Abn logo
Dec 2 2020 @ 14:01PM

పవన్‌ని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి.. ఎందుకంటే...

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి తండ్రి కేపీ రెడ్డెయ్య పామర్రు వద్ద పవన్ కల్యాణ్‌ని కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదన్నారు. తుపాను దెబ్బకి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రభుత్వాలు అంచనాలతో సరి పెట్టడమే తప్ప.. ఆదుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.


Advertisement
Advertisement
Advertisement