Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాచేపల్లిలో దారుణం.. 70 వడ్డెర కుటుంబాలపై బహిష్కరణ

గుంటూరు: దాచేపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష చూపించారు. ఇటీవల జరిగిన దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారన్న కక్షతో 70 వడ్డెర కుటుంబాలను బహిష్కరించారు. క్వారీల్లోకి వస్తే చంపేస్తామంటూ మీడియాను సైతం బెదిరించారు. తామంతా క్వారీల్లో పని చేసుకుంటున్నామని వడ్డెర సొసైటీ పేరుతో వైసీపీ నేతలు క్వారీయింగ్ చేస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. వైసీపీ నేతల బెదిరింపులను ఖండిస్తూ క్వారీ వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. 


Advertisement
Advertisement