Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి

అమరావతి: అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బాబు ఇంటికి వద్దకు చేరుకుంటున్నారు. గురువారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేశారు. ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 


సొమ్మసిల్లి పడిపోయిన బుద్దా వెంకన్న..

వైసీపీ నేతల దాడిలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు డీజీపీ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదనన్నారు. పట్టాభి మాట్లాడుతూ ఫ్యాక్టనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రకటించి దాడికి పాల్పడుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. సీఎం ప్రోద్భలంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement