Abn logo
Jan 18 2021 @ 00:37AM

వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరాయి

 టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి 


నందికొట్కూరు, జనవరి 17: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులు అన్యాయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని, దాడులు చేస్తున్నారని అన్నారు. బనగానపల్లెలో ప్రభుత్వ భూములు, వాగులు కబ్జా చేస్తే బీసీ జనార్దన్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారన్నారు. అక్కడి తహసీల్దార్‌ సరైన సమాధానం కూడా చెప్పలేదని, రెవెన్యూ రికార్డులు ఆర్‌అండ్‌బీ అధికారుల వద్ద ఉన్నాయనడం హాస్యాస్పదమని అన్నారు. సీఎం జగన్‌ నిజమైన అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి భార్య, భర్తకు ఒకే ఇంట్లో ఇద్దరి ఇచ్చారని అన్నారు. అర్హులకు కాకుండా వైసీపీ నాయకులకే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేస్తే గంట వ్యవధిలో 179 పట్టాలు తొలగించారన్నారని తెలిపారు. వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరాయని అన్నారు. ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణంలో టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొని రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ గుండం రమణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి, షకిల్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు. 



Advertisement
Advertisement
Advertisement