Abn logo
Mar 26 2020 @ 11:24AM

వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు స్వాధీనం

గుంటూరు: నరసరావుపేటలోని ఓ వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో... స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓ అధికార పార్టీ నేత పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రహస్యంగా ప్రజలకు అమ్మకాలు సాగించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సోదాలు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


Advertisement
Advertisement
Advertisement