Advertisement
Advertisement
Abn logo
Advertisement

సొమ్మొకడిది.. సోకొకడిది!!

వైసీపీ ప్రభుత్వంపై ‘సన్నారెడ్డి’ ఎద్దేవా


తోటపల్లిగూడూరు, డిసెంబరు 8 : ‘సొమ్మొకడిది.. సోకొకడిది’ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని కిసాన్‌ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం  మండలంలోని పోట్లపూడి దళితవాడ, గిరిజన కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, కేంద్ర నిధులకు స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను జగన్మోహన్‌రెడ్డి దారి మళ్లిస్తున్నారని   మండిపడ్డారు. మరికొన్ని పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఎందుకు ఓటు వేశామని రాష్ట్ర ప్రజలు మనస్తాపం చెందుతున్నారన్నారు. అంతేకాక బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ముందుగా సురేష్‌రెడ్డి దళితవాడ, గిరిజన కాలనీల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించి, వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి నాసిన గిరీష్‌, అధ్యక్షుడు తుళ్లూరు జనార్ధన్‌, అన్నం శ్రీనివాసులు, ముద్దు శ్రీనివాసులు, వెంకురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement