Abn logo
Jun 3 2020 @ 03:42AM

యువరాజ్‌..క్షమాపణ చెప్పు!

న్యూఢిల్లీ: మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి ఓ కులాన్ని కించపరిచేలా యువీ మాట్లాడడంతో సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోహిత్‌ శర్మతో యువీ ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ వీడియో ఏప్రిల్‌ నాటిదైనా ఇప్పుడు వైరల్‌గా మారింది. టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు. దీంతో నెటిజన్లు ‘యువరాజ్‌ మాఫీ మాంగో’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్వీట్‌ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement