Abn logo
Nov 1 2020 @ 03:16AM

సాహిత్యాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నాం : యండమూరి

పంజాగుట్ట, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): కొవి డ్‌ నేపథ్యంలో మారుతు న్న పరిస్థితులకు అనుగుణంగా సాహిత్యాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయి త యండమూరి వీరేంద్ర నాథ్‌ అన్నారు. దీనిలో భాగంగా మొదటిసారిగా చదువరి డాట్‌ కాం వెబ్‌ సైట్‌లో తాను రాసిన నిశ్శబ్ధ విస్పోటనం తొలి తెలుగు ఆన్‌లైన్‌ సీరియల్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.


శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ ప్రతినిధులు ప్రముఖ చేతిరాత నిపుణుడు మల్లికార్జున్‌, తెలుగు భాషాభిమాని వీవీఆర్‌ కిషన్‌లతో కలిసి ఆయన వెబ్‌సైట్‌లో తొలి తెలుగు ఆన్‌లైన్‌ సీరియల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ సాహిత్యాభిలాషులు వెబ్‌సై ట్‌ పెడితే ఎలా ఉంటుంది అని కొందరు అడుగగా తన వంతు సహాయం ఉంటుందని హామీ ఇచ్చానని చెప్పారు. సీరియల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితులకు సేవచేసే స్వచ్ఛంద సంస్థలకు, ఉపాధి కోల్పోయిన వారికి విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement