Abn logo
Oct 15 2021 @ 01:21AM

రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే

ప్రత్తిపాడులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి యనమల, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నవీన్‌, వరుపుల రాజా తదితరులు.. పక్కన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్న మాజీ మంత్రి బండారు, చినరాజప్ప

  • - యనమల రామకృష్ణుడు

ప్రత్తిపాడు, అక్టోబరు 14: రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పెదశంకర్లపూడిలో కొత్త వరుపుల రాజా ఏర్పాటుచేసిన టీడీపీ కార్యాలయాన్ని యనమల గురువారం ప్రారంభించారు. కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యన మల మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని, బీసీల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైఎస్సార్‌సీపీ చేసిన మరో అభివృద్ధి కార్యక్రమం ఏమీ కనిపించడం లేదన్నారు. విద్యారంగం సంక్షోభంలో ఉందని అమ్మఒడి కొత్త పథకం కాదని ఇంతకుముందు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్‌మెంట్‌ స్థానంలో దీన్ని ఇస్తున్నారన్నారు. టీడీపీ ఇచ్చి న దాంట్లో 10 శాతం జగన్‌ ఇస్తున్నారని, ఆటో వాళ్లకు రూ.10 వేలు ఇచ్చి ఫెనాల్టీ రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని యనమల విమర్శించారు. జగన్‌ యువతకు డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. జగన్‌ మల్లెపూలు కూడా అమ్ముకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, చేతివాటం చూపించే ప్రభుత్వమని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి  అనిత విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ జగన్‌ పబ్జీ అడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. జగన్‌ కంటే చంద్రబాబే అధికంగా సంక్షేమ పథకాలు అమలుచేశారని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. ప్రజలు చంద్రబాబును సీఎం చేసేం దుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా విద్యుత్‌ ఇస్తే, జగన్‌ ప్రభుత్వం రాష్ట్రా న్ని చీకటిమయం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. ఐటీ రంగంలో చంద్రబాబురాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచితే ప్రస్తుత వైసీసీ పాలనలో ఐటీ రంగం 14వ స్థానం లో దిగజారిందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్‌ నాయకులు జ్యోతుల నెహ్రూ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పెందుర్తి వెంకటేష్‌, దాట్ల సుబ్బరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నవీన్‌కుమార్‌, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి  కొండబాబు,  సుంకర పావని, బండారు సత్యానందరావు, యనమల శివరామకృష్ణన్‌, ఎస్‌వీ ఎస్‌ వర్మ, వంతల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు టీడీపీలో జోష్‌

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదశంకర్లపూడిలో పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖలతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి ఇన్‌చార్జిలు, సీనియర్‌ నేతలు తరలిరావడంతో అటు నాయకు ల్లోను, ఇటు కార్యకర్తల్లోను కొత్త ఉత్సాహం కనిపించింది. ప్రధానంగా మాజీ మంత్రి అయ్యన్న ప్రసంగం కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది.