Advertisement
Advertisement
Abn logo
Advertisement

యానాదుల ఉన్నతికి కృషి

కలెక్టర్‌ నివాస్‌

పెనమలూరు, నవంబరు 27 : యానాదుల ఉన్నతికి కృషి చేయటంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుప రిచే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ జె. నివాస్‌ అన్నారు. శనివారం యా నాదుల పిల్లలు చదువుతున్న పోరంకిలోని ప్రాఽథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా యానాదుల పిల్లలతో మమేకమై కొంతసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి భోజనం చేశారు.  అనం తరం   పిల్లలకు పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగులు, రెండు జతల యూనిఫాంను అందజేశారు. పలువురు యానాదుల కుటుం బాలకు రేషన్‌, ఆధార్‌ కార్డులు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలను అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యానాదుల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి వణుకూరులో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి మంచి వాతావరణంలో ఇళ్లను నిర్మించి ఒక మోడల్‌ కాలనీని అందించనున్నట్లు తెలిపారు. పిల్లలను పాఠశా లకు పంపితే అమ్మఒడి కింద ఏడాదికి రూ. 15 వేలు సహాయం అందుతుందన్నారు. జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే పిల్లలను పాఠశాలకు పంపాలన్నారు. యానాదుల కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాల్లో బాగా పని చేసినందుకుగాను తహసీల్దార్‌ భద్రు, ఎంపీడీవో విమాదేవిలను కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి రుక్మాందయ, డీఈవో తాహేరా సుల్తానా, తాడిగడప మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యప్రకాశరావు, విద్యా కమిటీ చైర్మన్‌ పరమేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement