Abn logo
Sep 2 2021 @ 20:35PM

షియోమీ నుంచి రెడ్‌మి 10 ప్రైమ్.. బరువెంతో తెలిస్తే షాకవుతారు!

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ రేపు (శుక్రవారం) మధ్యహ్నం ‘రెడ్‌మి 10 ప్రైమ్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయబోతోంది. ఇదే ఫోన్‌ను ఇప్పటికే రెడ్‌మి 10 పేరుతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మీడియా టెక్ హీలియో జి88 ఎస్ఓసీ, 90Hz ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. షియోమీ నుంచి వస్తున్న చవకౌన ఫోన్లలో ఇది కూడా ఒకటి కానుంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. అంతేకాదు, కంపెనీ వస్తున్న అత్యంత తేలికైన ఫోన్ ఇదేనని షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ పేర్కొన్నారు. 


రెడ్‌మి 10 ప్రైమ్ గ్లోబల్ వేరియంట్‌లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉపయోగించగా ఇండియన్ వేరియంట్‌లో మాత్రం 6000 ఎంఏహెచ్ఏ బ్యాటరీని ఉపయోగించారు. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 9 వాట్స్ రివర్స్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ బరువు 181 గ్రాముల బరువు, 8.9 మిల్లీమీటర్ల మందంతో ఉండగా, ఇండియన్ వేరియంట్ బరువు ఎంత అన్నది ఆసక్తికరంగా మారింది. 


రెడ్‌మి 10 ప్రైమ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: మీడియా టెక్ హీలియో జి88 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ, 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు,  ముందువైపు వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 4జీబీ ర్యామ్/ 64 జీబీ గ్లోబల్ వేరియంట్ ధర  దాదాపు 13,300 కాగా, 4జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 14,800, 6జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర దాదాపు రూ. 14,800 ఉండే అవకాశం ఉంది.