Jun 13 2021 @ 00:54AM

కవితలు రాస్తున్నా!

శ్రుతీ హాసన్‌ నటి, గాయని, స్వరకర్త. ఇప్పుడు కొత్తగా కవిత్వం రాయడం ప్రారంభించారు. ప్రస్తుతం తాను కవితలు రాస్తున్నానని శ్రుతీ హాసన్‌ తెలిపారు. కొత్త బాణీలు కట్టడం కుదరడం లేదు కనుక కవితలు రాస్తున్నానని చెబుతున్నారామె. ‘‘నేను కొత్త స్వరాలు సమకూర్చలేకపోతున్నా. అందుకని, కవితలు రాయడం ప్రారంభించా. అలాగని... నేనేమీ కొత్తదీ, ఎక్కడా లేనిదీ రాయడం లేదు. నేను చూసిన, అనుభూతి చెందిన, నా ఆలోచనల ప్రయాణంలో మెదిలిన అంశాలను కవితలుగా మలుస్తున్నా. ఆలోచన వచ్చిన వెంటనే రాసేస్తా. తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి దానికి ఓ రూపం ఇస్తా. టీనేజర్‌గా ఉన్నప్పట్నుంచీ నాకు ఈ అలవాటు ఉంది’’ అని శ్రుతీ హాసన్‌ వెల్లడించారు.