Advertisement
Advertisement
Abn logo
Advertisement

శంభులింగేశ్వరుడికి పుష్పాభిషేకం

 మట్టపల్లి నృసింహుడికి శాస్త్రోక్తంగా కల్యాణం

మేళ్లచెర్వు, మఠంపల్లి, డిసెంబరు 2: మేళ్లచెర్వులోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో 1001 కిలోల పుష్పాలతో గురువారం అభిషేకం నిర్వహించారు. కార్తీక మాస బహుళసప్తమి కావడంతో స్వామివారికి మహన్యాసపూర్వ ఏకదశ రుద్రాభిషేకం, చందనాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం దాతల సమకూర్చిన 1001 కిలోల పుష్పాలు, లక్షమారేడు దళాలతో బిల్వార్చన, స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అర్చకులు కొంక శివవిష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ  ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా, మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి చెన్నూరిమట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్‌, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement