Abn logo
Aug 2 2021 @ 00:51AM

అధ్వానంగా రహదారులు.. పట్టించుకోని అధికారులు

నింబగల్లు సమీపంలో దెబ్బతిన్న రోడ్డు

ఉరవకొండ, ఆగస్టు 1: మండలంలో రోడ్లు గుంతల మయమై అధ్వానంగా మారాయి. జాతీయ రహదారి నుం చి ఉరవకొండలోకి ప్రవేశించే ప్రధాన కూడలి రోడ్డు మధ్య లో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. నిత్యం ఈ మార్గంలో వేలాది వాహనాల రాకపోకల రద్దీ ఉంటుం ది. రహదారి మధ్యలో గుంతలు ప్రమాదకరంగా ఉండడం తో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ కూడలిలో అనేక మంది ప్రమాదాల కు గురయ్యారు. అయినా అధికారులు పట్టించుకోవడం లే దని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ మార్గం నుంచి అనంతపురం - బళ్లారి వైపుకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఇతర భారీ వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇంత ప్రా ధాన్యత ఉన్న ప్రధాన రోడ్డులో పెద్ద గుంత ఏర్పడింది. దా నికి కొద్ది దూరంలోనే మరో గుంతకూడా ఉంది. రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించలేక పోతున్నా రు. అలాగే ఉరవకొండ - కణేకల్లు రహదారిలోని హెచ్చెల్సీ వంతెన నుంచి రేణుమాకులపల్లి వరకు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని అధ్వానంగా తయారైంది. తారురోడ్డు దెబ్బతిని కంకర తేలాయి. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.