Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది.. జర్మనీలో మరో దుర్ఘటన!

ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి కారణమైన రెండో ప్రపంచయుద్ధానికి జర్మనీ కేంద్ర బిందువనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో జర్మనీని పాలించిన హిట్లర్ కారణంగా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ముగిసి 76 ఏళ్లు పూర్తయినా జర్మనీలో ఇంకా ఆనాటి ఆనవాళ్లు దొరుకుతూనే ఉన్నాయి. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పాతిన బాంబు తాజాగా పేలింది. 


మ్యూనిచ్‌లోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ నిర్మాణ స్థలంలో ఈ బాంబు బుధవారం పేలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో రైళ్లను నిలిపివేశారు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం జర్మనీలోని ముఖ్య నగరాల్లో బాంబుల కోసం క్షుణ్నంగా పరిశీలన జరిపింది. చాలా వాటిని నిర్వీర్యం చేసింది. అయినప్పటికీ ఈ బాంబు దొరకలేదు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement