Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్.. ధరెంతంటే..!

వాషింగ్టన్: అమెరికాలో ఓ రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేసి, గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించేంత ప్రత్యేకత ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఏముందని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


ఈ మధ్య చాలా మంది ఇష్టంగా తింటున్న ఆహార పదార్థాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. కాగా.. జూలై 13న నేనషన్ ఫ్రెంచ్ ఫ్రైస్ డే సందర్భంగా న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 అనే రెస్టారెంట్ సిబ్బంది.. 23 క్యారెట్ల బంగారపు డస్ట్‌తో ఏకంగా 200 అమెరికన్ డాలర్ల విలువైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను రూపొందించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.15వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌కు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement