Abn logo
Jul 15 2020 @ 08:18AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 2.15 ల‌క్ష‌ల క‌రోనా కేసులు!

న్యూఢిల్లీ: అంత‌కంత‌కూ విస్త‌రిస్తున్న క‌రోనా కార‌ణంగా ప్రపంచవ్యాప్తంగా  ఆందోళ‌న‌క‌ర పరిస్థితులు నెల‌కొన్నాయి. ప్రతి రోజూ రెండు లక్షలకుపైగా కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 2.15 లక్షల కేసులు నమోదయ్యాయి. 5,311 మంది మృతిచెందారు. వరల్డ్‌మీటర్ తెలిపిన వివ‌రాల ప్రకారం ప్రపంచంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక కోటీ 34 లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ‌గా, మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల 80 వేలు దాటింది. ఇప్పటివరకు 78 లక్షల మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాకు అత్య‌ధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో కొన‌సాగుతోంది. ఇప్పటివరకు 35 లక్షలకుపైగా జ‌నం క‌రోనా బారిన ప‌డ్డారు. ఒక లక్షా 39 వేలకుపైగా జ‌నం ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో కూడా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. బ్రెజిల్‌లో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. బ్రెజిల్ తరువాత భార‌త్‌, రష్యాల‌లో క‌రోనా సోకిన వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో ఒక లక్షా 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో గరిష్ట కేసుల సంఖ్య పరంగా భారత్ మూడవ స్థానానికి చేరుకోగా, అత్యధిక మరణాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.  

Advertisement
Advertisement
Advertisement