Abn logo
Dec 2 2020 @ 00:53AM

హెచ్‌ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  1.  వైద్యులు, అధికారులు, ప్రముఖుల పిలుపు


     హెచ్‌ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పలువురు వైద్యులు, అధికారులు, ప్రముఖులు పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. 


      నంద్యాల (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 1: హెచ్‌ఐవీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని నంద్యాల జిల్లా వైద్యశాల ఇన్‌చార్జి సూపరిండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్‌ భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసులుతో పాటు ఇన్‌చార్జి ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధాకర్‌, నర్సింగ్‌ సూపరిండెంట్‌ రాజేశ్వరి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్‌ శ్రీనివాసులు అందరితో ఎయిడ్స్‌ రహిత సమాజానికి పాటుపడాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. కరోనా కాలంలో అందించిన సేవలకు గాను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, సభ్యులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు. చైల్డ్‌ ఫండ్‌ సంస్థ రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ గంగన్న, ఎన్‌సీసీ ఆఫీసర్‌ బాలరాజు, అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. హెచ్‌ఐవీ, కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీడబ్ల్యూఆర్‌డీఎస్‌ ప్రాజెక్టు మేనేజర్‌ కిర్మయి అన్నారు. జిల్లా ఎయిడ్స్‌ నివారణ విభాగం సహకారంతో బీడబ్ల్లూఆర్‌డీఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక సుజలా పైపుల ఫ్యాక్టరీలో అవగాహన కల్పించారు. కార్మికులకు హెచ్‌ఐవీ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు.


     నంద్యాల: మండలంలోని చాపిరేవుల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎయిడ్స్‌ వ్యాధి నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. హెచ్‌ఎం శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సదస్సుకు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పామన్న ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు.


     ఆళ్లగడ్డ: ఎయిడ్స్‌ వ్యాధిని తరిమేద్దామని చైతన్య రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ వర్ధనాచారి పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ నివారణ దినం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 47 మంది యువకులు రక్తదానం చేశారని రక్త నిధి నిర్వాహకురాలు, వైద్యురాలు ఉమాదేవి చెప్పారు. వీరందరికి ధృవీకరణ పత్రాలు అందించినట్లు ఆమె చెప్పారు.


     శిరివెళ్ల: ఎయిడ్స్‌ వ్యాధి సోకకుండా ప్రజల్లో అవగాహన పెంపొందిం చాలని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో తృతీయ బహుమతి సాధించిన విద్యార్థిని ఆయన అభినందించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి నాగేశ్వరరావు, అధ్యాపకులు లలిత, నాగేంద్ర పాల్గొన్నారు. 


     రుద్రవరం: మండలంలోని ఆలమూరులో వైద్యాధికారి వినయ్‌ ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


     ఓర్వకల్లు: ఓర్వకల్లు ఆదర్శ పాఠశాల స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రిన్సిపాల్‌ షాహీనా పర్వీన్‌ ప్రారంభించారు. 


     చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలో వైద్యుడు గంగాధర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీబీ నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రెడ్డెమ్మ, సూపర్‌వైజర్లు రామలింగారెడ్డి, ప్రమీల, సీతారాములు, ఎయిడ్స్‌ నివారణ అధికారి పరిహాన, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 


      బనగానపల్ల్లె: పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని మంగళవారం నిర్వహించారు. ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వారు నిర్వహించిన వెబ్‌కాస్టులైవ్‌ ప్రోగ్రాంలో ప్రిన్సిపాల్‌, అధ్యాప కులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ స్వర్ణలతాదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వ రరెడ్డి పాల్గొన్నారు. న్యాక్‌ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్‌ లక్షణాలు, నివారణ, చికిత్స జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగా హన కల్పించారు. అధ్యాపకులు నరసింహారావు, నూర్‌బాషా, సుమలత, శాంతకుమారి, ఉమాశంకర్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎం ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని నిర్వహించారు. డాక్టర్‌ శివశంకరుడు ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్లు, సిబ్బందితో ఎయిడ్స్‌పై డాక్టర్‌ శివశంకరుడు అవగాహన కల్పించారు. 


     ఆత్మకూరు రూరల్‌: బైర్లూటి గూడెంలో వైద్యాధికారి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీహెచ్‌వో బస్తిపాటి మౌలాలి, సూపర్‌వైజర్‌ సర్వేశ్వరమ్మ, హెల్త్‌ అసిస్టెం ట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

   

     ఆత్మకూరు పట్టణంలోని ఆరోగ్య ఉపకేంద్రం 1 లో మెరిబా స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తరణ అధికారి విజయ్‌ కుమార్‌ ఆరోగ్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. మెరిబా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జుల్ఫీకర్‌, టీబీ సూపర్‌వైజర్‌ రవికుమార్‌, లెప్రసీ ఆఫీసర్‌ నారాయణ, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement