Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహమ్మారిని అంతం చేద్దాం!

  • ఎయిడ్స్‌ డే సందర్భంగా హెచ్‌ఐవీ పిల్లలతో కలెక్టర్‌ అల్పాహార విందు

కాకినాడ సిటీ, డిసెంబరు 1: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ప్రభావిత బాధితులకు బాసటగా నిలిచి వివక్ష రహిత సమాజం ద్వారా అసమానతలను, ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేద్దామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం పురస్కరించుకుని బుధవారం స్థానిక ఆఫీసర్స్‌ ఎన్‌క్లేవ్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లల్లో మనోధైర్యాన్ని నింపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో వారికి సహపంక్తి అల్పాహార విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరికిర ణ్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర  మేయర్‌ సుంకర శివప్రసన్న, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ అల్లి రాజాబాబు, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆదేశ్‌కుమార్‌, జీఎం మల్లిక్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన, అప్ర మత్తత, వ్యాధి నియంత్రణకు చేపట్టిన కార్యచరణ ద్వారా జిల్లాలో ఎయిడ్స్‌ పాజిటివిటీ గణనీయంగా తగ్గించగలిగామన్నారు. అనంతరం ఓఎన్జీసీ, హార్లిక్స్‌ సంస్థలు అందించిన  పౌషకాహార కిట్లను అతిఽథుల చేతులమీదుగా హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి కేవీఎస్‌ గౌరీశ్వరరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పి.వెంకట బుద్ధా, డీసీహెచ్‌వో రమేష్‌కుమార్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.రమేష్‌, రిలయన్స్‌ సంస్థ హెచ్‌ఆర్‌ పి.సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు రాగిరెడ్డి అరుణకుమార్‌, నల్లబిల్లి సుజాత పాల్గొన్నారు. 

Advertisement
Advertisement