Abn logo
Aug 2 2021 @ 00:31AM

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌.. తుది దశకు చేరిన పనులు

ఏలూరు సిటీ, ఆగస్టు 1: జిల్లాలో వ్యవసాయ బోర్లకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి, 57 సబ్‌ స్టేషన్లలో 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. 111 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారు. ధర్మాజీగూడెం, ద్వారకా తిరుమల, టి.నరసాపురం, గొల్లగూడెం ప్రాంతాల్లో నాలుగు 132 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలో 500 పైగా వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లుండగా 27 మినహా మిగిలిన వాటికి తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. మిగిలిన ఫీడర్లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 98 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.