Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూలీలకు వంద రోజులు పనికల్పించాలి

వాంకిడి, నవంబరు 27: ఉపాధిహామి పథకంలో కూలీలకు వందరోజులు పనులు కల్పించాలని ఎంపీపీ ముండే విమలాబాయి పేర్కొన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో క్లస్టర్‌ ఫెసిలిటేషన్‌ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పనులను చేపట్టి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వందమంది కూలీలు పనిచేసేలా చూడాలన్నారు. ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ సత్యనారా యణ, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీవో శివకుమార్‌, ఏపీవో శాఖిర్‌ ఉస్మానియా, కార్యదర్శులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement