Abn logo
Oct 12 2020 @ 03:57AM

కార్మికులు సంఘటితంగా పోరాడాలి

శామీర్‌పేట: సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితమై పోరాడాలని బీఎంఎస్‌ నాయకుడు, ఎంపీటీసీ నాగరాజు పిలుపునిచ్చారు.  మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో ఆదివారం భారతీయ మజ్ధూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్‌లను కార్మికులకు అనుగుణంగా సవరించాలని కోరారు. అక్టోబర్‌ 10నుంచి 16వరకు జరగనున్న ‘చలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఎంఎస్‌ నాయకులు పాపిరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాము, రమేశ్‌, ధనుంజయ, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement