Abn logo
Sep 15 2021 @ 07:55AM

HYD : మూడ్రోజుల క్రితం మిస్సయిన మహిళ హత్య.. ఏం జరిగింది..!?

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ హత్యకు గురైంది. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం పడి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా హిందూపూర్‌ గ్రామానికి చెందిన ప్యాటల మహదేవ, సుజాత (35) దంపతులు. వారికి అనిత (12), వజ్ర (6) కూతుళ్లు ఉన్నారు. ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జవహర్‌నగర్‌లోని భజరంగ్‌కాలనీలో ఉంటున్నారు. భార్యాభర్తలు కూలి పని చేస్తున్నారు. రోజూలాగే ఈనెల 11న సుజాత పనికి వెళ్లింది.


తిరిగి ఇంటికి రాకపోవడంతో మహదేవ జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మూడు రోజుల అనంతరం కార్పొరేషన్‌ పరిధివికలాంగుల కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో సుజాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాయితో కొట్టిచంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమెను దివ్యాంగుల కాలనీ వైపు ఎవరు తీసుకెళ్లారు..? హత్యకు గల కారణాలేంటి..? అనేది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శివకుమార్‌, సీఐ భిక్షపతిరావు తెలిపారు.