Abn logo
Jun 1 2021 @ 07:49AM

జీడిమెట్లలో మహిళ మిస్సింగ్.. ఆయనపైనే అనుమానం!

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. జగద్గిగుట్ట రోడామేస్త్రినగర్‌-ఏకు చెందిన సయ్యద్‌ జావిద్‌ భార్య ఫర్జానా బేగం(30) సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు అబ్దుల్‌ అజార్‌ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర పర్భని జిల్లాకు చెందిన ఆషుపై తమకు అనుమానం ఉంది, అతడి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.