Abn logo
Oct 20 2020 @ 00:01AM

మహిళల పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌

Kaakateeya

 రాష్ట్ర సగర, ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ

బద్వేలు, అక్టోబరు 19 : రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్న సంకల్పంతో కార్పొరేషన్లలో అత్యధిక శాతం మహిళలను చైర్‌పర్సన్లను చేసి సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర సగర, ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్జీవో కాల నీ వద్ద ఉన్న వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విగ్రహానికి గానుగపెంట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.


కార్యక్రమానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ రమణమ్మ, బంగారు శ్రీనయ్యలు మాట్లాడుతూ వైసీపీలో కష్టపడిన వారికి ఫలితం దక్కుతుందన్నారు. కార్పొ రేషన్‌ పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత  ఇవ్వడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, సింగసాని గురుమోహన్‌, గానుగపెంట శ్రీనివాసులు, సుందరరామిరెడ్డి తదితరులు పాలొ ్గన్నారు.


కాగా  రాష్ట్ర సగర, ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన రమణమ్మకు అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక ఎన్‌జీవో హోం కాలనీ లోని వారి నివాసంలో రమణమ్మను, ఆమె భర్త శ్రీనివాసులును వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా సన్మానించారు.  

 


Advertisement
Advertisement