Abn logo
Sep 21 2021 @ 08:06AM

Bihar: ప్రియుడితో కలిసి భర్తను చంపి, ముక్కలు చేసిన భార్య

ముజఫర్‌పూర్‌(బీహార్): తన ప్రియుడితో కలిసి భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా కోసి కెమికల్ లో వేసిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ నగరంలో వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌లోని సికందర్‌పూర్ నగర్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత తన ప్రియుడు సుభాష్, సోదరి రాధలతో కలిసి తన భర్త 30 ఏళ్ల రాకేష్ ను హతమార్చింది. భర్త మృతదేహాన్ని వదిలించుకోవడానికి దాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను కెమికల్ లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. దీంతో కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఫ్లాట్ లోపల చెల్లాచెదురుగా ఉన్న మృతదేహం ముక్కలు కనిపించాయి.  

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఫోరెన్సిక్ బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహం రాధా భర్త రాకేశ్ గా గుర్తించారు.బీహార్ రాకేశ్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడని, పోలీసుల భయంతో అతను ఇంటికి రావడం లేదని తేలింది.దీంతో అతని భాగస్వామి సుభాష్ రాకేశ్ భార్యను చూసుకునే వాడని, దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు చెప్పారు. తీజ్ సందర్భంగా భర్త రాకేశ్ ను ఇంటికి పిలిచిన భార్య ప్రియుడు, చెల్లెలు సహాయంతో చంపిందని పోలీసులు చెప్పారు. మృతుడి సోదరుడు దినేష్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...