Abn logo
Sep 19 2020 @ 06:50AM

పెళ్లికి వెళుతూ పామును పట్టిన మహిళ... వీడియో వైరల్!

Kaakateeya

బెంగళూరు: ఒక మహిళ అందంగా అలంకరించిుకుని పెళ్లికి బయలుదేరింది. ఇంతలో ఒక ఇంటిలో పాము దూరిన విషయం ఆమెకు తెలిసింది. పాములను పట్టే ఆ మహిళ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డాక్టర్ అజయతా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.


ఈ ట్వీట్ ప్రకారం పామును పట్టిన ఆ మహిళ పేరు విరాట్ భాగిని అని, ఆమె కర్నాటకకు చెందినవారని తెలుస్తోంది. ఆమె పాములు పడుతుంటారని సమాచారం. ఆమె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా, ఎవరో తమ ఇంటిలోకి పాము దూరిందని ఆమెకు ఫోన్ చేశారు. దీంతో ఆమె అక్కడకు వెళ్లి పామును పట్టారు. ఈ వీడియోను ఇప్పటివరకూ నాలుగు లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ రకరకాలుగా అభినందనలు కురిపిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement