Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

బ్రహ్మంగారిమఠం, నవంబరు 27: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లెపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు... బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లె గ్రామానికి ఎం.లక్ష్మిదేవి (45) అనే మహిళ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి పశువులకు మేత వేయడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి పిల్లలు ఉదయం పశువుల పాక వద్దకు వెళ్లగానే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉందని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని శనివారం మైదుకూరు డీఎస్పీ ఎస్‌.విజయకుమార్‌, రూరల్‌ సీఐ కొండారెడ్డి పరిశీలించారు. మృతురాలి మరిది వెంకటరమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు, ఆ మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త 15 సంవత్సరాల కిందట చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement