Abn logo
Nov 30 2020 @ 05:12AM

పెళ్లన్నాడు..గర్భవతిని చేశాడు!

పాక్‌ కెప్టెన్‌ ఆజమ్‌పై మహిళ ఆరోపణలు

కరాచీ: అన్ని ఫార్మాట్లకు పాకిస్థాన్‌ కెప్టెన్‌గా ఇటీవలే నియమితుడైన బాబర్‌ ఆజమ్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఆజమ్‌ తన పాఠశాల స్నేహితుడిగా చెబుతున్న ఆ మహిళ..ప్రేమ, పెళ్లి పేరిట అతడు తనను మోసం చేశాడని చెప్పింది. ఆదివారం కరాచీలో విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం... ‘నన్ను పెళ్లి చేసుకుంటానని 2010లోనే బాబర్‌ మాటిచ్చాడు. గర్భవతిని కూడా చేసి పెళ్లికి ముఖం చాటేశాడు. అదేమని అడిగితే హింసిస్తున్నాడు, పోలీసులకు చెప్పవద్దని బెదిరిస్తున్నాడు’ అని ఆరోపించింది.

Advertisement
Advertisement
Advertisement