Abn logo
Feb 26 2021 @ 00:20AM

గంటల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి

 బలిజపాలెంలో విషాదఛాయలు

సబ్బవరం, ఫిబ్రవరి 25: మండలంలోని నారపాడు శివారు బలిజపాలెం గ్రామంలో తండ్రి, కుమార్తె  గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారపాడు సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ, జనసేన మద్దతుతో మామిడి శంకరరావు పోటీ చేశారు. కుమారుడు గెలుస్తాడో లేదో అనే ఒత్తిడికి గురై అతని తండ్రి అప్పారావుకు గుండెపోటు వచ్చింది. ఆయనను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శంకరరావు సర్పంచ్‌గా గెలిచాడన్న సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. చికిత్స పొందుతూ అప్పారావు(70) బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలిసి కొంత కాలంగా తండ్రి వద్దే ఉంటున్న కుమార్తె గంగా భవాని(40) గురువారం ఉదయం కుప్పకూలిపోయి మృతి చెందింది. వీరిద్దరూ గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పరామర్శించారు.


Advertisement
Advertisement
Advertisement