Abn logo
Aug 8 2021 @ 18:52PM

ఆ హోదా నాకొద్దు, ఉత్తర్వులను వెనక్కుతీసుకోండి.. లేఖ రాసిన యడియూరప్ప

బెంగళూరు: తనకు కేబినెట్ హోదా ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కుతీసుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం నాడు కోరారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి హోదాలో నాకు ఇవ్వాల్సిన సౌకర్యాలను మాత్రమే ఇవ్వాలని మనవి చేస్తున్నా. కేబినెట్ హోదాను వెనక్కు తీసుకోండి’’ అంటూ సీఎం బొమ్మైకి లేఖ రాశారు. ప్రస్తుతం యడియూరప్ప షికారిపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా.. కేబినెట్ హోదా ఉన్న మంత్రికి అందే సౌకర్యాలను యడియూరప్పకూ ఇవ్వాలంటూ ఇటీవల సీఎం బొమ్మై ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.