Abn logo
Oct 20 2020 @ 00:05AM

బీజేపీతోనే దళితులకు రాజకీయ ఉన్నత అవకాశాలు

Kaakateeya

 బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌ 

రాజంపేట, అక్టోబరు19 : దళితులకు బీజేపీలోనే రాజకీయ ఉన్నత అవకాశాలు లభిస్తాయని బీజేపీ రాష్ట్ర మోర్చ అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌ పేర్కొన్నారు. సోమవారం రాజంపేటలోని ఓ కల్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్‌ జిల్లా ఎస్సీ మోర్చ ఆత్మీయ సమావేశానికి దేవానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు.


బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు మాట్లాడుతూ రాబోవు పార్టీ సంస్థాగత పదవుల్లో దళితులకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. రాజంపేట పార్లమెంట్‌ బీజేపీ  అధ్యక్షుడు ఎ.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు మాట్లాడుతూ దేశంలో దళితులకు బీజేపీలోనే మంచి గుర్తింపు వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సురే్‌షరాజు, శ్రీనివాసులు, వెంకటయ్య, సుబ్బానాయుడు, ఆదినారాయణ, శ్రీనివాసులు, ప్రశాంత్‌, కిషోర్‌,అభిరామ్‌, పెంచలయ్య, సుబ్బారావు, చలపతి పాల్గొన్నారు.


Advertisement
Advertisement