Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుడిచిపెట్టుకుపోయిన పంటలు

మొలక దశలోనే శనగ, పొద్దుతిరుగుడు నాశనం 

తేమ ఎక్కువై దెబ్బతిన్న పత్తి

పులివెందుల, నవంబరు 27: కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గం రైతులు నష్టపో తున్నారు. ఎన్నడూ చూడని నష్టాన్ని చవి చూస్తున్నామని రైతులు ఆవేదన పడుతు న్నారు. శనగ మొదలుకొని, ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిపంట వరకు అన్నీ తుడిచిపె ట్టుకుపోయాయి. పొలాల్లో తేమ ఆరకుం డా ఏకబిగిన వర్షాలు కురుస్తుండడంతో మొలకెత్తిన పంట నుంచి దిగుబడి సిద్దం గా ఉన్న పంటల వరకు అన్నీ  దెబ్బతిన్నా యి. దాదాపు 42వేల ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లినట్లు అధికారిక అంచనా. ఇందుకు సంబంధించిన వివరాల్లోకెళితే... 

 ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవ ర్గంలో దాదాపు 42వేల ఎకరాల్లో వివిధ రకా ల పంటలు ఎడతెరిపిలేని వర్షాలతో దెబ్బతి న్నాయి. రైతులకు ఈ వర్షాలు కన్నీరు మిగి ల్చాయి. వర్షాల కారణంగా పత్తి రంగు మా రడమే కాకుండా పూర్తిగా దెబ్బతినింది. ఖరీఫ్‌లో సాగైన పత్తి, ఆముదం, కంది, తది తర పంటలు దెబ్బతినగా రబీలో సాగైన శన గ, మినుము, పొద్దుతిరుగుడు తదితర పంట లు మొలకదశలోనే దెబ్బతిన్నాయి. శనగ పంట విషయానికొస్తే దాదాపు 21వేల ఎకరా ల్లో శనగ పంట మొలక దశలోనే ఎండిపో యింది. దాదాపు ఐదు వేల ఎకరాల్లో మిను ము అధిక వర్షాల కారణంగా దెబ్బతిం టోం ది.

మూడు వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట దెబ్బతినింది. పత్తి, కంది, ఆముదాలు తదితర పంటలు మరో 10వేల ఎకరాల్లో పం టలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా. ఉద్యానపంటలైన ఉల్లి, మిరప తదితర పంటలు మరో 1000 ఎకరాల్లో దెబ్బతిన్నా యి. పక్వానికి వచ్చిన సమయంలో వర్షాల కారణంగా చీనీకాయలు మార్కెట్‌కు తరలిం చే వీలులేకుండా పోయింది. పొలాల్లో ఉన్న చీనీపంట మార్కెట్‌కు తరలించేందుకు వ్యా పారులు ఎవరూ ముందుకు రాలేదు.

ఫలి తంగా చీనీ రైతులకు కనీవినీ ఎరుగని రీతి లో నష్టం వాటిల్లింది. ఎకరాకు 8 నుంచి 10 టన్నులు దిగుబడి ఇచ్చే చీనీతోటలు, వర్షాల కారణంగా దిగుబడి వచ్చినా మార్కెట్‌కు తరలించే పరిస్థితి లేకపోవడంతో చీనీకాయ లు పూర్తిగా నేలరాలిపోయాయి. ఎకరాకు ఒకటి, రెండు టన్నులు మాత్రమే మిగిలాయ ని ఎప్పుడూఇంతటి నష్టాన్ని చూడలేదని రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

దెబ్బతిన్న పొద్దుతిరుగుడు


Advertisement
Advertisement